News March 11, 2025

చిత్తూరుకు ఒరిగిందేమీ లేదు: చింతా

image

కాంగ్రెస్‌తోనే SC, STలకు మేలు జరుగుతుందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఉద్ఘాటించారు. జీడీ నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మోసం చేస్తున్నాయని చప్పారు. కాంగ్రెస్ పెట్టిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను సైతం వైసీపీ ప్రభుత్వం మూసేసిందన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ, కూటమి ప్రభుత్వంలోనూ చిత్తూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.

Similar News

News March 12, 2025

ఎంపీ ల్యాడ్స్ పనులు పూర్తి చేయాలి

image

ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన పనుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 48 పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

News March 11, 2025

చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 అర్జీలు

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 ఫిర్యాదులు అందినట్టు అధికారులు సోమవారం తెలిపారు. రెవెన్యూ 112, పంచాయతీ రాజ్ ఒకటి, పోలీస్ శాఖ 11, పంచాయతీరాజ్‌కు మూడు ఫిర్యాదులు వచ్చినట్టు వారు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.

News March 10, 2025

చిత్తూరు DMHO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

error: Content is protected !!