News February 20, 2026

చిత్తూరులో ఉద్యోగాలు ..ఇవాళే లాస్ట్ డేట్

image

చిత్తూరు DMHOలో 7 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ(CS), డిగ్రీ, డిప్లొమా, మెడికల్ గ్రాడ్యుయేట్(మైక్రో బయాలజీ, వైరాలజీ, పాథాలజీ), MSc(మెడికల్ మైక్రోబయాలజీ), BSc(MLT), ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేయడంతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in

Similar News

News February 21, 2026

NRPT: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో బంగారు పతకం

image

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్ 16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.

News February 21, 2026

SVU: AP PGCET-26కు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర ఉన్నత విద్యామండలి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో AP PGCET-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ పద్మావతి పేర్కొన్నారు. 17 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 09.

News February 21, 2026

NGKL: యాప్ ద్వారా 2.18 లక్షల బస్తాల యూరియా పంపిణీ

image

జిల్లాలో యూరియా యాప్ ద్వారా 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాల పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 24 యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 7.53 లక్షల యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు.