News February 23, 2025
చిత్తూరులో చికెన్ ధరలు ఇవే..

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.155 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.177గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News December 23, 2025
నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్ , విక్రమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.
News December 23, 2025
చిత్తూరు: మూడేళ్ల నుంచి 257 మంది మృతి

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.
News December 23, 2025
చిత్తూరు జిల్లాలో మందగిస్తున్న ఉపాధి పనులు.!

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.


