News January 24, 2025
చిత్తూరులో చీటింగ్ కేసు నమోదు

2000 వ సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ టెండరు దక్కించుకొని సక్రమంగా పంపిణీ చేయని చర్చి వీధికి చెందిన శ్రీ షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ అధినేత కామేశ్వరరావుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ జయరామయ్య తెలిపారు. 25 ఏళ్లుగా కేసు నడుస్తున్నప్పటికీ వాయిదాకు గైర్హాజరు కావడంతో నేడు దండోరా వేశామన్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News September 17, 2025
చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.
News September 16, 2025
TTD టోకెన్ల జారీలో మార్పు

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.
News September 16, 2025
చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.