News April 2, 2025
చిత్తూరులో ప్రాణం తీసిన ఫోన్ నంబర్..!

ఓ ఫోన్ నంబర్ వివాదం ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. ఏనుగుంట్లపల్లి హరిజనవాడకు చెందిన ఉమకు 14 ఏళ్ల కిందట వివాహం జరగ్గా.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె ఫోన్ నంబర్ పక్కింట్లో ఉండే శివశంకర్ ఫోన్‌లో ఉంది. దీనిని గమనించిన అతని భార్య సుజాత.. ఉమతో పాటు భర్తను నిలదీసింది. దీంతో మనస్థాపం చెంది ఉమ ఇంట్లోనే ఉరేసుకుంది.
Similar News
News April 3, 2025
పనుల ఆలస్యంపై చిత్తూరు కలెక్టర్ ఆగ్రహం

చిత్తూరు-గుడియాత్తం అంతరాష్ట్ర రహదారి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌పై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ రహదారి మరమ్మతు పనుల పురోగతిని R&B అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. సకాలంలో పనులు చేయకపోతే కాంట్రాక్టర్‌ను మార్చేస్తామని హెచ్చరించారు.
News April 3, 2025
చిత్తూరు: డీఆర్వోను కలిసిన ఫ్యాప్టో నాయకులు

12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఫ్యాప్టో చిత్తూరు జిల్లా ఛైర్మన్ మణిగండన్ డిమాండ్ చేశారు. డీఆర్వో మోహనకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో నెం.117ను రద్దు చేయాలని, తెలుగు మీడియాన్ని పునరుద్ధరించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. 11వ PRC, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లను తక్షణం చెల్లించాలని కోరారు.
News April 2, 2025
చిత్తూరు: ముగ్గురికి కాంస్య పతకాలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖోఖో పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు (ఫిజికల్ డైరెక్టర్లు) సురేష్ కుమార్, ముత్తు, దేవేంద్ర సత్తా చాటారు. ముగ్గురికీ కాంస్య పతకాలు దక్కాయి. ఈక్రమంలో వారిని కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. సహకారం అందించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బాలాజీని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు.