News January 25, 2026

చిత్తూరులో ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాంట్

image

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ రీ సైకిల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. శనివారం నగరిలో జరిగిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో చిత్తూరు నగరపాలక సంస్థ, జాగృతి టెక్ ప్రైవేటు లిమిటెడ్, వుయ్ కేర్ యూ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. రోజువారీగా ఉత్పత్తయ్యే సుమారు నాలుగు టన్నుల ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News February 8, 2026

చిత్తూరు: వృద్ధురాలి దారుణ హత్య

image

గుడిపల్లి (M) ON కొత్తూరు సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఆదివారం చిన్నక్క (70) ఆనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుతో పాటు చెవులను సైతం కోసి దారుణంగా హత్య చేశారు. ఇటుకల బట్టీలో వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని ఇటుకల కోసం వచ్చిన వారు చూసి స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 8, 2026

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు PGRS కార్యక్రమం

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉ.10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లాస్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

News February 8, 2026

ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలోని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై (బర్డ్ ఫ్లూ) పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీ పక్షుల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖకు, జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుందన్నారు.