News April 8, 2025

చిత్తూరులో భార్యపై యాసిడ్‌తో దాడి

image

చిత్తూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన దావూద్, రేష్మ భార్యభర్తలు. మనస్పర్థలతో ఇటీవలే విడిపోయారు. ఈక్రమంలో నిన్న రాత్రి దావూద్ రేష్మ ఇంటికి వెళ్లి కాపురానికి రావాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో దావూద్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రేష్మ ముఖంపై చల్లాడు. ఆమె గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. గాయపడిన రేష్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 17, 2025

మంత్రి చేతుల మీదగా పలమనేరు విద్యార్థినికి అవార్డ్ 

image

పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ కోర్స్ విద్యార్థిని హర్షిత ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె మంత్రి లోకేశ్ చేతుల మీదగా ‘షైనింగ్ స్టార్ అవార్డు’ తల్లిదండ్రులతో కలిసి అందుకున్నారు. తవణంపల్లి(మ) గాజులపల్లికు చెందిన ట్రాక్టర్ డ్రైవరు టి.రవి, లక్ష్మీల కుమార్తె హర్షిత. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News April 16, 2025

చిత్తూరు: కంట్రోల్ సెంటర్ పరిశీలించిన ఎస్పీ

image

చిత్తూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం సందర్శించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. సెంటర్ నెట్వర్క్‌ను అనుసంధానించబడిన ముఖ్య కూడలిలో సీసీ కెమెరాలు దృశ్యాలను లైవ్‌గా పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శక్తి యాప్‌లో SOS సంకేతం ద్వారా ఫిర్యాదులను కంట్రోల్ సెంటర్ సిబ్బంది చూడాలన్నారు.

News April 16, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి రూరల్ BTRకాలనీలో ఓ వృద్ధుడు స్థానికంగా ఉంటున్న పిల్లలకు తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. నిన్న తన ఇంట్లో ముగ్గురు చిన్నారులకు వీడియోలు చూపిస్తుండగా స్థానికులు గమనించారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మేస్త్రి పనులు చేసే సెల్వంగా గుర్తించి అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

error: Content is protected !!