News January 13, 2026
చిత్తూరులో మహిళ మృతి

చిత్తూరులో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని పీసీఆర్ సర్కిల్లో 45 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళ మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారించగా రెండు రోజులుగా అదే ప్రాంతంలో ఆమె ఉన్నట్టు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 08572 234100 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News April 5, 2026
కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల దాడి: వైసీపీ

CTR: అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు కార్వేటినగరం(M) అల్లాగుంటకు చెందిన AR కానిస్టేబుల్ యుగంధర్‌పై TDP నేతలు దాడికి తెగబడ్డారని YCP ఆరోపించింది. ‘బైక్‌పై వెళ్తున్న యుగంధర్‌పై TDP నాయకులు ఆదాము, ప్రవీణ్, భాగ్యరాజ్ దాడి చేశారు. తీవ్ర గాయాలతో కానిస్టేబుల్ కోమాలోకి వెళ్లిపోయారు. ఏంటి ఈ దారుణం చంద్రబాబు, అనిత. పోలీసులపై ఇలా దాడి చేశారంటే.. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా?’ అని YCP ట్వీట్ చేసింది.
News April 5, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.148 నుంచి రూ.154, మాంసం రూ.215 నుంచి 246 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.244 నుంచి రూ.271 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 5, 2026
చిత్తూరు: ఇలా అయితే కొత్త ఇళ్లు కట్టినట్లే.!

యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. చిత్తూరు జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇనుము టన్నుకు రూ.10 వేలు, సిమెంటు బస్తా రూ.30 మేర పెరిగింది. అలాగే కేబుల్ ధరలు పెరిగిపోయాయి. పీవీసీ పైపుల ధరలు సుమారు 30 శాతం మేర పెరిగాయి. పెయింటింగ్ ధరలను కంపెనీలు పెంచేశాయి. వేసవిలో నిర్మాణ పనులు అధికంగా చేపడతారు. పెరిగిన ధరలు వారిపై భారం మోపునున్నాయి.


