News January 16, 2026
చిత్తూరు: అధికారుల గ్రూపులో న్యూడ్ వీడియోలు

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ అధికారుల గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం రేపాయి. ‘సమాచార శాఖ.కుప్పం’ గ్రూపులో I&PR డీడీ పేరిట న్యూడ్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీటితో పాటు ఓ APK ఫైల్ సైతం వచ్చింది. దీంతో ఇతర ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రూపులో ఆ వీడియోలు తొలగించారు. డీడీ ఫోన్ హ్యాక్ కావడంతోనే ఇలా జరిగిందని సమాచారం. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News February 13, 2026
ఒంటరిగానే పోటీ.. ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

TNలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామని, ఏ కూటమిలోనూ చేరబోమని సేలం సభలో TVK అధినేత విజయ్ తెలిపారు. అలాగే కొందరు ఓటుకు రూ.5వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆ డబ్బు ప్రజలదే అని దాన్ని తీసుకొని వారి చెవుల్లో విజిల్ వేసి వెళ్లగొట్టాలన్నారు. మరోవైపు ఈ సభలో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం.
News February 13, 2026
అందోలు- జోగిపేట పీఠం కాంగ్రెస్‌దే

అందోలు- జోగిపేట మున్సిపాలిటీ పీఠంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 20 వార్డులకు గాను 17 వార్డులు కాంగ్రెస్ దక్కించుకుంది. 2 వార్డులు బీఆర్ఎస్, ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 46 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, మొయినాబాద్ హంగ్, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్‌లో మరో వార్డు ఫలితం రావాల్సి ఉంది. కానీ, ఇక్కడ ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేయలేదు.


