News August 23, 2024
చిత్తూరు: అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు : ఎస్.పి

ఆరోగ్య సమస్యలను పూజలతో నయం చేస్తామని ఎవరైనా మీ ఇంటికి అపరిచిత వ్యక్తులు వస్తే వారిని నమ్మకండి అని అటువంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్.పి మణికంఠ చందోలు అన్నారు. ఎస్.పి మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల పట్ల సందేహం ఉంటే 100/112 కు లేదా చిత్తూరు జిల్లా పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News February 19, 2026
చిత్తూరు: అక్కడ మధ్యాహ్నం వరకే స్కూల్స్..

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల పనివేళల్లో సవరణ చేస్తున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఉపాధ్యాయులు రంజాన్ మాసంలో ప్రతి రోజూ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు.
News February 19, 2026
చిత్తూరు పూర్వ DMHOకు మెమో

కొవిడ్ 3వ దశ సన్నాహకాల్లో వైద్యుల నియామకం, హోం క్వారంటైన్ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అప్పటి చిత్తూరు DMHO శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం శాఖాపర చర్యలను ప్రారంభించింది. UPHCల్లో ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో, 183 మంది సపోర్టింగ్ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించామని శ్రీహరి రిప్లై ఇవ్వడంతో ఆ చర్యలను నిలిపేసింది. పారదర్శకంగా విధులు నిర్వహించాలని మెమో జారీ చేసింది.
News February 19, 2026
చిత్తూరు: వాటర్ ప్లాంట్లకు రూ.10లక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంఈవోలతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.10 లక్షల మంజూరు చేస్తామని చెప్పారు. దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పీఎం శ్రీ నిధులను మార్చిలోపు వినియోగించాలన్నారు. పనితీరు సక్రమంగా లేని HMలను మారుస్తామని హెచ్చరించారు.


