News April 12, 2025

చిత్తూరు: అప్పుడు.. ఇప్పుడూ లాస్టే

image

ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలవగా.. గతేడాది సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో అట్టడగున నిలిచింది. 2024లో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 10,882 మంది పరీక్షలు రాయగా.. 6,817 మంది పాసై 63 శాతం పర్సంటేజీతో 26వ స్థానానికి జిల్లా పరిమితమైంది. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో 13,183 మందికి 7,168 మందే పాస్(54%) కావడంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే లాస్ట్ స్థానంలో నిలిచింది.

Similar News

News April 13, 2025

చిత్తూరులొ 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు 

image

సోమవారం అంబేడ్కర్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 

News April 12, 2025

చిత్తూరు జిల్లా లాస్ట్

image

ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా వెనుకబడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఇయర్‌లో 13,183 మంది పరీక్షలు రాయగా కేవలం 7,168 మందే పాసయ్యారు. 54 శాతం పాస్ పర్సంటేజీతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానం(26)లో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 11,450 మందికి 8,440 మందే పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది.

News April 12, 2025

చిత్తూరు: మచ్చా.. నా రిజల్ట్ చూడు రా..!

image

చిత్తూరు జిల్లాలో 30,713 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 15,639, సెకండియర్‌లో 15, 074 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘మచ్చా.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.

error: Content is protected !!