News January 11, 2026
చిత్తూరు: అమ్మానాన్నపై ప్రేమతో..❤

చనిపోయిన తల్లిదండ్రుల పేరిట మాలధారణ చేసి ప్రేమను చాటుకున్నారు చిత్తూరుకు చెందిన SRB ప్రసాద్, ఈశ్వరీ దంపతులు. ‘మా అమ్మనాన్నకు 10మంది పిల్లలైనప్పటికీ కూలీ పనులు చేసి పెంచారు. వాళ్లు చనిపోయాక అమ్మనాన్న పడ్డ కష్టం, ప్రేమకు గుర్తుగా ‘అమ్మానాన్న దీవెన మాల’ స్వీకరించాం. మిగిలిన వాళ్లు ఇలా చేయాలని ఆశిస్తున్నాం’ అని ప్రసాద్ చెప్పారు. సంక్రాంతి రోజు తల్లిదండ్రుల ఫొటో వద్ద పూజలు చేసి మాల విరమించనున్నారు.
Similar News
News February 11, 2026
అమలాపురం: అధికారులను అభినందించిన కలెక్టర్

సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులను కలెక్టర్ మహేష్ కుమార్ అభినందించారు. అధికారులతో ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్ల గురించి చర్చించారు. భవిష్యత్తులో ఉత్సవాల నిర్వహణ సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
News February 11, 2026
పన్నుల వసూల్లో అధికారులు కీలకపాత్ర పోషించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి కీలక కార్యాచరణ అమలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చడంలో అధికారులకు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాణిజ్య, జీఎస్టీ పన్నులకు సహాయపడేలా ప్రతి శాఖకు వాణిజ్య పన్నుల శాఖ వారు ఒక ఫార్మేట్ రూపొందించాలన్నారు.
News February 11, 2026
లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.


