News March 7, 2025
చిత్తూరు: అయ్యో దేవుడా ఎంత పని చేశావు.!

ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
Similar News
News March 9, 2025
కుప్పంలో గిట్టుబాటు ధరలు లేని బంతిపూలు

రైతులకు గిట్టుబాటు ధర లేక బంతిపూలను కుప్పం పురపాలక సంఘం పూలు మార్కెట్ నుంచి రైతులు టాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. బంతి పూలను జంతువులకు ఆహారంగా పెడుతున్నారు. మార్కెట్లో బంతిపూలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే పూల రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
News March 8, 2025
చిత్తూరు: వైసీపీ మహిళా విభాగంలో జిల్లా వాసుల నియామకం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర మహిళా అనుబంధ విభాగంలో చోటు లభించింది. రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గీతా యాదవ్, జనరల్ సెక్రటరీలుగా గాయత్రీ దేవి, దాక్షాయిణి, స్పోక్స్ పర్సన్‌గా శ్రీదేవి రెడ్డి, కార్యదర్శులుగా మేరీ జయరాం, సరస్వతమ్మ, కల్పలత రెడ్డి, యమునమ్మ, ధనలక్ష్మిని నియమిస్తూ పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
News March 8, 2025
పలమనేరు: పేదరికం నుంచి SI వరకు

పేదరికంలో పుట్టినా ఏ రోజు వెనుకడుగు వేయలేదు. తల్లిదండ్రుల కష్టాలను చూసి ఉన్నత స్థాయికి ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. లక్ష్యం కోసం అహర్నిషలు కష్టపడుతూ అనుకున్నది సాధించారు పలమనేరు SI కె.స్వర్ణలత. సత్యసాయి(D) ధర్మవరానికి చెందిన ఆమె 1993న జన్మించారు. చిన్నతనంలో కష్టాలను చూసి గొప్ప స్థాయిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన ఆమె 2017లో SI ఉద్యోగానికి ఎంపికై శభాష్ అనిపించుకున్నారు.