News November 4, 2025
చిత్తూరు: ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్యశాల నూతన భవనాన్ని చిత్తూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందికి ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
పుంగనూరులో విషాదం

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.
News November 3, 2025
చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
News November 3, 2025
అడవి పందుల కోసం వేట.. ఇద్దరి మృతి

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


