News April 8, 2024
చిత్తూరు: ఇద్దరు మహిళలకే అవకాశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 MLA, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. వైసీపీ జీడీ నెల్లూరు MLA అభ్యర్థిగా కృపాలక్ష్మి, నగరి అభ్యర్థిగా రోజా పోటీ చేయనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మహిళకు అవకాశం దక్కలేదు. గతంలో గల్లా అరుణ కుమారి నాలుగు సార్లు, గుమ్మడి కుతూహలమ్మ ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రులుగా పనిచేశారు.
Similar News
News October 4, 2025
శ్రీకాళహస్తి నేతలకు ఊహించని షాక్

శ్రీకాళహస్తి ఆలయ <<17906968>>బోర్డు సభ్యత్వంపై ఆశపెట్టుకున్న<<>> లోకల్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బోర్డులో స్థానికులు ఆరుగురికే చోటు దక్కింది. మిగిలిన 11 మంది(మొత్తం 17మంది సభ్యులు) వేరే జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 శాతం లోకల్ వాళ్లు, 20 శాతం బయట వారికి బోర్డులో అవకాశం కల్పించారు. బోర్డు ఛైర్మన్గా జనసేన నేత కొట్టే సాయి నియమితులైన విషయం తెలిసిందే
News October 3, 2025
తిరుపతి MP ఫిర్యాదుపై జాతీయ SC కమిషన్ స్పందన

దేవరంపేట గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేసిన 2 గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ నివేదికలో FIR వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు అరెస్టుల సమాచారం ఇవ్వాల్సినట్లు స్పష్టం చేసింది.
News October 3, 2025
చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఆయుధపూజ

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో గురువారం ఆయుధపూజ నిర్వహించారు. ఆయుధ కారాగారం, పోలీసు క్యాంటీన్, జిమ్, పోలీసు అసోసియేషన్ ఆఫీస్, అడ్మిన్ కార్యాలయాలలోనూ పూజలు చేశారు. ప్రజల రక్షణకై పోలీసు సిబ్బంది తుపాకులను క్రమశిక్షణతో వాడుతుందని ఎస్పీ తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించడానికి విజయదశమి ప్రతీక అన్నారు.