News December 21, 2025

చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

image

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.

Similar News

News December 24, 2025

చట్టాల గురించి తెలుసుకోండి: చిత్తూరు ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీటీ పీసీలకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం పరిశీలించారు. వారి శిక్షణ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిలబస్ అమలుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

News December 24, 2025

మంచి విలువలు పాటించాలి: చిత్తూరు SP

image

క్రిస్మస్ పండగ ప్రేమ, కరుణ, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. సమాజంలో శాంతి నెలకొనడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మంచి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు అందించాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.

News December 24, 2025

చిత్తూరు జిల్లాలో ఇతగాడితో జాగ్రత్త..!

image

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన కె.చంద్రబాబు(33)పై ప్రభుత్వం PD యాక్ట్ ప్రయోగించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమాయకులను మోసం చేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండేళ్లలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రజాశాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు అడ్వయిజరీ బోర్డు తేల్చింది. 12నెలలు అతడిపై పీడీ యాక్ట్ అమలు కానుంది.