News October 20, 2024

చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ కనబడటం లేదంటూ పోస్టర్లు

image

చిత్తూరు MLC, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్ భరత్ కనబడడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఎమ్మెల్సీ భరత్ కుప్పం వైపు పెద్దగా కన్నెత్తి చూడడం లేదు. ఈ నేపథ్యంలో ‘MLC భరత్  కనబడడం లేదు. ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయగలరు. కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్‌గా మారింది.

Similar News

News December 27, 2024

కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.

News December 25, 2024

అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన

image

తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.

News December 25, 2024

తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.