News January 13, 2026
చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Similar News
News February 1, 2026
CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్‌తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్‌తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.
News February 1, 2026
చిత్తూరు: 27 వేల మంది పాడి రైతులకు లబ్ధి

జిల్లాలో 19న మొదలైన ఉచిత పశు వైద్యశిబిరాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున 37 శిబిరాలు నిర్వహించగా.. 13 రోజుల్లో 718 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. మొత్తంగా 88,303 పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వైద్య సేవలు అందించడంతో 27,656 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లు జేడీ వివరించారు.
News February 1, 2026
నేడే కేంద్ర బడ్జెట్.. చిత్తూరు జిల్లా ఆశలు తీరేనా.?

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ద్రవిడ వర్సిటీని కేంద్ర వర్సిటీగా మార్చాలని లేదా ప్రత్యేక గ్రాంట్ల కోసం డిమాండ్ ఉంది. చిత్తూరులో స్కిల్ వర్సిటీ, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు, కుప్పం–పలమనేరు ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమల నేపథ్యంలో ఎగుమతి సుంకాల తగ్గింపు, GST సవరణల చర్చ సాగుతోంది. మామిడి గుజ్జు పరిశ్రమలు, బెల్లం మండీలకు క్లస్టర్ డెవలప్‌మెంట్ కింద కేంద్ర ప్రోత్సాహకాలు అందించాలని పలువురు కోరుతున్నారు.


