News November 23, 2025

చిత్తూరు: ఏనుగులను తరిమెందుకు ఏఐ నిఘా!

image

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఏఐ కెమెరా, లౌడ్ స్పీకర్‌తో అనుసంధానం చేసి అమర్చి ఏనుగులు వచ్చినప్పుడు గుర్తించి లౌడ్ స్పీకర్ ద్వారా తుపాకుల శబ్దం చేసేలాగా అమర్చారు. చిత్తూరు సమీపంలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా సత్ఫాలితలు వచ్చాయి. దీంతో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, బంగారుపాలెంలో అమర్చేందుకు చర్యలు చేపట్టారు.

Similar News

News November 24, 2025

MHBD: ఎస్టీలకే అన్ని సర్పంచ్ స్థానాలు!

image

మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని 11 మండలాలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం ఖరారు చేశారు. జిల్లాలోని బయ్యారం (29), కొత్తగూడ (24), గార్ల (20) మండలాల్లోని అన్ని సర్పంచ్ స్థానాలు ఎస్టీ (ST) సామాజిక వర్గానికే రిజర్వ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఈ మూడు మండలాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఇతర సామాజిక వర్గాల నాయకులకు నిరాశ తప్పలేదు.

News November 24, 2025

నరసరావుపేట: నేతన్నలకు అమలు కానీ ఉచిత విద్యుత్.!

image

చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు ఆగస్టు 7న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పథకం అమలు కాలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో కేవలం 280 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి గ్రామాలలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

News November 24, 2025

ADB: కొందరు ఖుషిలో.. ఇంకొందరు నిరాశలో

image

ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపు రిజర్వేషన్లు కొందరిని ఆనంద పర్చగా.. మరికొందరిని నిరాశలోకి నెట్టింది. జిల్లాలో బీసీలు ఆశించిన చాలా స్థానాలు మళ్లీ ఎస్టీలకు రిజర్వుడ్ కావడంతో నిరాశ అలుముకుంది. ఇదే సమయంలో బీసీలకు కేటాయించిన పలు స్థానాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. తమకున్న అవకాశాలు చేజారాయని బీసీలు నిరాశలో ఉన్నారు. SC, STలు ఖుషీలో ఉన్నారు.