News May 12, 2024

చిత్తూరు: ఏనుగు దాడిలో ఒకరు మృతి

image

జిల్లాలోని తవణంపల్లె మండలం వెంగంపల్లె ST కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పి.చిన్నయ్య(50) ఆదివారం ఉదయం కాలనీకి సమీపంలోని మామిడి తోటలో బహిర్భూమికి వెళ్లాడు. ఏనుగును చూసిన కుక్కలు మొరిగాయి. దీంతో చిన్నయ్య అటుగా వెళ్లగా.. ఆయనను ఏనుగు వెంబడించి చంపేసింది. స్థానికులు స్థానిక అటవీ శాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 22, 2025

చిత్తూరు పోలీసులకు 50 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 50 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 5, భూతగాదాలపై 18 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ
సిబ్బందిని ఆదేశించారు.

News December 22, 2025

చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

News December 21, 2025

చిత్తూరు: రేపు ఉదయం 9 నుంచి ప్రారంభం.!

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరగనుందని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.