News April 18, 2025

చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

image

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.

Similar News

News December 18, 2025

టాప్‌లో చిత్తూరు జిల్లా

image

ఆధార్ అప్‌డేట్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆధార్ నిబంధనల మేరకు 5-7 ఏళ్ల, 15-17 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయాలి. చిత్తూరు జిల్లాలో 48,948 మంది పిల్లలు ఈ వయసు వారు ఉండగా డిసెంబర్ 13వ తేదీ నాటికి 30,929 మంది అప్‌డేట్ చేసుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తంగా 63%తో చిత్తూరు జిల్లా ఆధార్ అప్‌డేట్‌లో మొదటి స్థానంలో ఉంది.

News December 17, 2025

సమావేశానికి హాజరైన చిత్తూరు కలెక్టర్

image

జిల్లా కలెక్టర్‌లతో సీఎం చంద్రబాబు అమరావతిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులే కీలకమని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆదేశించారన్నారు.

News December 17, 2025

22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

image

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.