News April 24, 2025

చిత్తూరు: ఒకేసారి తండ్రి, కుమార్తె పాస్

image

చిత్తూరు జిల్లా రొంపిచర్ల పంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. 1995-96లో 10వ తరగతి పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిలయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారారు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో తన కుమార్తె బి.సమీనాతో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. షబ్బీర్‌కు 319, కుమార్తె సమీనాకు 309 మార్కులు రావడం విశేషం.

Similar News

News August 23, 2025

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈవో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఇప్పటికే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి

News August 22, 2025

చిత్తూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

image

కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో నిజమైన ఫేస్ బుక్ ఖాతా నుంచి అలెర్ట్ మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర సమాచారం అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. నకిలీ అకౌంట్‌తో జాగ్రత్త వహించాలని సూచించారు.

News August 22, 2025

భూమన బెదిరింపులకు భయపడం: పూతలపట్టు ఎమ్మెల్యే

image

వైసీపీ నేత భూమన బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. టీటీడీని వైసీపీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన చేసిన ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.