News February 1, 2025
చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన నగరి DSP

చిత్తూరు జిల్లా సచివాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను నగరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీ మహమ్మద్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. నగరి డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందికర సమస్యలు ఉంటే తనను సంప్రదించవచ్చని, తగిన న్యాయం చేస్తామని తెలిపారు. తాను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటానని తెలిపారు.
Similar News
News February 26, 2026
‘సంజీవని’ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. ఈ సేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు.
News February 26, 2026
పనులు పరిశీలించిన చిత్తూరు కలెక్టర్

త్వరలో చిత్తూరులో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
News February 26, 2026
చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్‌ఫర్

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు


