News April 16, 2024
చిత్తూరు కలెక్టర్ కీలక సూచన

చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జాతర నిర్వహణపై కలెక్టర్ షన్మోహన్ కీలక సూచనలు చేశారు. మే 10 లోపు లేదా మే 15 తర్వాత గంగ జాతరలు చేసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. జాతర నిర్వహణకు పోలీస్ స్టేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయరాదని సూచించారు.
Similar News
News October 7, 2025
కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ ములకలచెరువు ఎక్సైజ్ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.
News October 7, 2025
చిత్తూరు: ధరలు తగ్గింపు పై అవగాహన కల్పించాలి

సూపర్ జీఎస్టీతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 7, 2025
చిత్తూరు: వర్షాలు ఎఫెక్ట్.. విద్యుత్ శాఖకు భారీ నష్టం

జిల్లాలోని వర్షం కారణంగా పలు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు చిత్తూరు జిల్లాలో 14 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 25 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన వీటి మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖా అధికారి ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు.