News December 10, 2025
చిత్తూరు: కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వినతి

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వైసీపీ ఎంపీలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి తదితరులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.
Similar News
News December 14, 2025
కుప్పం: పేలిన నాటు బాంబు.. పరిస్థితి విషమం

కుప్పం (M) కొట్టాలూరు పంచాయతీ ఎర్రమన్ను గుంతలు సమీపంలో నాటు బాంబు పేలి చిన్న చిన్న తంబి (38) తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న తంబి శరీరం ఓవైపు పూర్తిగా కాలిపోవడంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. చిన్న తంబి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 14, 2025
చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.
News December 14, 2025
మిస్ ఆంధ్రాగా చిత్తూరు అమ్మాయి

అందాల పోటీల్లో చిత్తూరు జిల్లా అమ్మాయి మెరిసింది. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ దంపతులు బెంగళూరులో సెటిల్ అయ్యారు. వాళ్ల కుమార్తె జీవిరెడ్డి సహస్ర రెడ్డి(15) మోడల్‌గా రాణిస్తున్నారు. ఇటీవల విజయవాడలో APఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎన్విరాన్‌మెండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్నారు. టీనేజ్ విభాగంలో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.


