News April 15, 2025
చిత్తూరు: కిలో 7 రూపాయలే..!

మామిడి సాగుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల మామిడి పండుతుంది. కానీ రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఓవైపు పూత, దిగుబడి సమస్య వేధిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతును కకావికలం చేస్తున్నాయి. నిన్న జిల్లాలో వీచిన గాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాటిని మండీలకు తరలిస్తే కేజీకి రూ.7 నుంచి రూ.10 మించి ధర లభించలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Similar News
News April 17, 2025
CTR: మీరు ఇలా చేయకండి

చిత్తూరు సంతపేటలో బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజా ‘defabet sports’ యాప్‌లో బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. లాభాలు రావడంతో ఆశపడి భార్య నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును యాప్‌లో పెట్టి పోగొట్టాడు. వారం వ్యవధిలోనే నాలుగైదు రూ.లక్షలు నష్టపోయాడు. ఎక్కడైనా బెట్టింగ్ జరిగినట్లు తెలిస్తే చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబరు 9440900005కు సమాచారం ఇవ్వాలని SP మణికంఠ సూచించారు.
News April 17, 2025
పార్టీలో చిత్తూరు ఎంపీకి మరో పదవి

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావుకు పార్టీలో మరో కీలక పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించారు. ఈ కమిటీలో చిత్తూరు ఎంపీని మెంబర్‌గా అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు ఎంపీ దగ్గుమళ్ల ధన్యవాదములు తెలిపారు.
News April 17, 2025
అమెరికాలో చంద్రగిరి వాసికి మంత్రి పదవి

అగ్రరాజ్యం అమెరికాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసికి కీలక పదవి లభించింది. చంద్రగిరికి చెందిన టీడీపీ మహిళా నేత లంకెళ్ల లలిత, శ్రీరాముల కుమారుడు బద్రి 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి విస్కాన్ సిన్ స్టేట్‌లోని మాడిసన్ డిస్ట్రిక్ట్-7లో అల్డర్ పర్సన్‌గా 53.8 శాతం ఓట్లతో గెలిచారు. తాజాగా ఆయన నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.