News January 11, 2025

చిత్తూరు: కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు,ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధమని SP మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఎవరైనా ఈ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాడ్పడినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని  హెచ్చరించారు. వీటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News January 11, 2025

BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

image

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

News January 11, 2025

నేను ఎక్కడికి పారిపోను: చెవిరెడ్డి

image

న్యాయం తనవైపు ఉందని, తాను ఎక్కడికి పారిపోనని YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసులు చెప్పిదంతా అబద్ధం అన్న చెవిరెడ్డి.. తనకు సుప్రీంకోర్టులో అయినా న్యాయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు తాను ఎక్కడికి వెళ్లనని, తన ఫోను కూడా ఆఫ్ చేయనని స్పష్టం చేశారు.

News January 11, 2025

13న పి.జీ.ఆర్.ఎస్ రద్దు : చిత్తూరు కలెక్టర్

image

13వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్  తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.