News March 28, 2025

చిత్తూరు: ఖాళీ స్థానాలకు ఎన్నికలు

image

చిత్తూరు జిల్లాలో మండల పరిషత్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News December 13, 2025

చిత్తూరు: ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ ఫెస్ట్

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు, అనంతరం 20న జిల్లాస్థాయి కెరీర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రంగాలు, విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

News December 13, 2025

చిత్తూరు: ALERT.. ఈ నెల 19 లాస్ట్.!

image

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. టెన్త్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.

News December 13, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.