News December 12, 2025

చిత్తూరు: ఘోరం బస్సు ప్రమాదంపై మరిన్ని వివరాలు.!

image

చిత్తూరుకు చెందిన ప్రైవేట్ బస్సు ఇవాళ అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి గురైన బస్సు ఈ నెల 6వ తేదీన తీర్థయాత్రల కోసం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం వద్ద బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు భద్రాచలంలో స్వామి వారిని దర్శించుకుని అన్నవరం వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 12, 2025

MDK: సర్పంచ్‌గా నాడు తల్లి.. నేడు తనయుడు

image

మెదక్ జిల్లా సరిహద్దులో గల హవేలి ఘనపూర్ మండలం పోచంరాల్‌లో సర్పంచ్‌గా లంబాడి రాజు విజయం సాధించారు. అయితే మొన్నటి వరకు రాజు తల్లి పేంలీ సర్పంచ్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సమీప ప్రత్యర్థి రూప్ సింగ్ పై 167 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో గతంలో తల్లి, ఇప్పుడు తనయుడు సర్పంచ్‌గా పనిచేయనున్నారు.

News December 12, 2025

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>డైరెక్టరేట్ <<>>ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 75 కాంట్రాక్ట్ లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిింది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. LLB/LLM ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://enforcementdirectorate.gov.in

News December 12, 2025

పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

image

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.