News December 24, 2025

చిత్తూరు చిన్నది.. టాలెంట్‌లో గొప్పది.! ❤️

image

పిట్ట కొంచెం కూత ఘనం అంటె ఇదే. చిత్తూరుకు చెందిన 1వ తరగతి విద్యార్థిని పీ.హేత్విక వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకుంది. వేలూరులో జరిగిన ఎలైట్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో “స్పెల్ మారథాన్” అనే అంశంలో ఆమె సత్తా చాటింది. 4 నిమిషాలలో 50 ఆంగ్ల పదాలు అక్షర దోషం లేకుండా మౌఖికంగా చెప్పినందుకు అవార్డును సాధించింది. నృత్య ప్రదర్శనలోనూ హేత్విక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మరో రికార్డును సాధించడం విశేషం.

Similar News

News January 10, 2026

బాపట్ల జిల్లాలో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు

image

“హిట్ అండ్ రన్” ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ​బాధితులు FIR, పోస్టుమార్టం నివేదిక, ఇతర పత్రాలతో తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ విచారణ అనంతరం కలెక్టర్ ఆమోదంతో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ద్వారా బాధితులకు పరిహారం అందుతుందన్నారు.

News January 10, 2026

VJA: దుర్గమ్మ శ్రీచక్రార్చన పాలలో పురుగు.. వాస్తవమెంత?

image

దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ప్రతిరోజూ అమ్మవారికి నిర్వహించే శ్రీచక్రార్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్లలో ఒక దానిలో పురుగు కనిపించింది. అర్చకులు వెంటనే ఆ పాలను పక్కన పడేసి ఇతర పాలతో అర్చన పూర్తి చేశారు. కొన్నేళ్లుగా ప్యాకెట్ పాలు, విడిగా ఆవుపాలను సేకరిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.