News November 10, 2024
చిత్తూరు: చిరుత దాడిలో మరో పాడి ఆవు మృతి.?
చిరుత దాడిలో మరో ఆవు మృతి చెందినట్లు చౌడేపల్లి మండలంలోని రైతులు చెబుతున్నాడు. బాధిత రైతు కథనం మేరకు.. నాగిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డికి ఆవులు ఉన్నాయి. వాటిని సమీపంలోని కందూరు అడవిలోకి మేత కోసం తరలించారు. సాయంత్రం పశువులన్నీ ఇంటికి చేరుకోగా ఒక ఆవు కనిపించలేదు. రైతు గాలింపు చేపట్టగా శనివారం చనిపోయి కనిపించింది. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.
Similar News
News November 12, 2024
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలి: సప్తగిరి
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి తీరిక లేని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. మంగళవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడిస్తానని బీరాలు పలికిన పెద్దిరెడ్డి నేడు అసెంబ్లీకి వెళ్లడానికి ముఖం చాటేశారని అన్నారు.
News November 12, 2024
మన చిత్తూరు జిల్లాకు బడ్జెట్‌లో వచ్చింది ఎంతంటే?
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. (కోట్లలో)
➤హంద్రీ-నీవాకు రూ.2014.23
➤తిరుపతి కార్పొరేషన్‌కు రూ.350
➤తెలుగుగంగ ప్రాజెక్టు పనులకు రూ.879.24
➤గాలేరు నగరికి రూ.2438.94
➤SVUకి రూ.226.38
➤వెటర్నరీ వర్సిటీకి రూ. 153
➤పద్మావతి వర్సిటీకి రూ.72.73
➤ ద్రవిడ వర్సిటీకి రూ.27.91
➤శ్రీసిటీ ఐఐటీకి రూ.19.52
News November 12, 2024
చిత్తూరు: 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలు
చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ బీపీ, షుగర్, గుండె, థైరాయిడ్, పెరాలసిస్, క్యాన్సర్ వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగానే వ్యాధులు గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుందన్నారు.