News February 28, 2025
చిత్తూరు: జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు పెంపు

జిల్లాలో ఫిబ్రవరి 28 తో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ను పొడిగిస్తూ సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు లేక కొత్త కార్డులు మంజూరు చేయడం ఏది ముందు జరిగితే అప్పటివరకు కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి అక్రిడేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు.
Similar News
News February 28, 2025
రోడ్డు ప్రమాదంలో చిత్తూరు వాసి దుర్మరణం

గూడూరు ఆదిశంకర College వద్ద నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని TATA AC ఢీకొనడంతో చిత్తూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 28, 2025
చిత్తూరు- పుత్తూరు హైవేపై ప్రమాదం.. MLA బాబాయ్ దుర్మరణం

కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(70) నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెదురుకుప్పం మండలం చవటగుంటకు చెందిన గోవర్ధన్ బైకుపై కార్వేటినగరం నుంచి పళ్లిపట్టుకు వెళుతూ చొక్కలింగంను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చొక్కలింగం అక్కడికక్కడే మృతి చెందగా.. గోవర్ధన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చిన్నాన్నగా స్థానికులు గుర్తించారు.
News February 27, 2025
జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

మార్చి 1న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైయుజన్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.