News October 22, 2025

చిత్తూరు జిల్లాకు ఆరంజ్ అలర్ట్

image

చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లా అంతట మంగళవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Similar News

News October 22, 2025

చిత్తూరు CDCMS పర్సన్ ఇన్‌ఛార్జ్ జేసీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

చిత్తూరు: పాఠశాలలకు సెలవు

image

రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. అలాగే రేపు పాఠశాలలకు సెలవులు సెలవులు ప్రకటిస్తూ ఎంఈవోలకు డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 21, 2025

చిత్తూరు: సెల్యూట్.. సీఐ రుషికేశవ

image

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం