News December 27, 2025

చిత్తూరు జిల్లాకు కొత్తగా 2472 ఇళ్లులు మంజూరు

image

PMAY పథకం కింద చిత్తూరు జిల్లాకు కొత్తగా 2,472 ఇళ్లులు మంజూరయ్యాయి. చిత్తూరు మున్సిపాలిటీకి 828, కుప్పం మున్సిపాలిటీకి 575, నగరి మున్సిపాలిటీకి 516, పుంగనూరు మున్సిపాలిటీకి 115, పలమనేరు మున్సిపాలిటీకి 114 ఇళ్లులు మంజూరయ్యాయి. అలాగే బైరెడ్డిపల్లికు 60, గంగవరంకు 85, పలమనేరుకు 60, పెద్దపంజాణికి 110, వీకోటకు 9 ఇళ్లులు మంజూరయ్యాయి. మొత్తం మీద పలమనేరు నియోజకవర్గానికి 438 ఇళ్లు మంజూరయ్యాయి.

Similar News

News December 28, 2025

చివరి గ్రీవెన్స్‌ను పబ్లిక్ సద్వినియోగం చేసుకోండి : జిల్లా ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఎంతగానో అనుకూలమైన కార్యక్రమం అన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి పీజీఆర్ఎస్.

News December 28, 2025

చిత్తూరు: DCCB ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

image

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఈనెల 27తో ముగియగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2026 జూన్ 26వ తేదీ వరకు రాజశేఖర్ రెడ్డి DCCB నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు.

News December 28, 2025

నేడు పనిచేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

image

చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. వీరితో పాటు హెచ్ఎ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని ఆయన కోరారు.