News March 20, 2024

చిత్తూరు జిల్లాకు చేరిన ఓటర్ ఎపిక్ కార్డులు

image

రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన 1.11 లక్షల ఓటరు ఎపిక్ కార్డులు చిత్తూరు కలెక్టరేట్‌కు చేరాయి. ఈనెల 17న 81 వేలు, ఈనెల 18న 30 వేలు మొత్తం 1.11 లక్షల కార్డులు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. వీటిని స్కాన్ చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు పంపారు. ఆ శాఖ నుంచి జిల్లాలోని సంబంధిత ఓటర్ల చిరునామాకు పోస్టు ద్వారా చేరవేయనున్నారు.

Similar News

News February 16, 2026

చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News February 16, 2026

చిత్తూరు: కళ్లు లేవు సార్.. పెన్షన్ ఇప్పించండి!

image

జీడీనెల్లూరు గ్రామానికి చెందిన మాళవిక తన తండ్రితో కలిసి చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్ డేకు హాజరైంది. తనకు రెండు కళ్లు లేవని.. పెన్షన్ ఇప్పించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. గ్రామ సచివాలయ అధికారులను ఆశ్రయిస్తే.. రాదన్నారని చెప్పింది. అర్హతను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయడానికి నివేదిక ఇవ్వాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

News February 16, 2026

కార్మికులకు పింఛను సౌకర్యం

image

రోజువారి కూలీలతో జీవనం సాగించే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. వయసును బట్టి నెలకు ప్రీమియం రూ. 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల అనంతరం నెలవారి రూ. 3 వేలు పింఛను వస్తుంది. లబ్ధిదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50% పింఛన్ చెల్లిస్తారు.