News November 26, 2025
చిత్తూరు జిల్లాకు ప్రథమ స్థానం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓటర్ల జాబితా క్లెయిమ్‌ల పరిష్కారంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. నవంబర్ నెలకు గాను మంగళవారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో డీఆర్ఓ సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతం అవుతుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,979 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.
Similar News
News February 11, 2026
చిత్తూరు: బీపీఎస్ పథకానికి స్పందన ఏది?

చిత్తూరు జిల్లాలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకానికి తగినంతగా ఆదరణ లభించడం లేదు. ఇప్పటివరకు 300 లోపే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో చిత్తూరు నగరపాలక పరిధిలోనే 200 పైగా ఉన్నాయని తెలుస్తోంది. 2019లో జిల్లాలో ఇందుకోసం సుమారు 2000 దరఖాస్తులు వస్తే రూ.9 కోట్ల ఆదాయం చేకూరింది. ప్రస్తుతం మార్చిలో గడువు ముగియనుండడంతో అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.
News February 11, 2026
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS)లో టీచర్లు నమోదు చేసిన తప్పుల సవరణకు విద్యాశాఖ అనుమతించిందని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్లు వారి వ్యక్తిగత వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులుంటే తగిన ఆధారాలతో ఈనెల 14వ తేదీలోపు డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీఐఎస్ డేటాలో హెచ్ఎంలు, టీచర్లు తప్పుడు సమాచారం పొందుపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 11, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


