News September 12, 2025
చిత్తూరు జిల్లాలోని ఈ మండలాల్లో రేపు పవర్ కట్

జిల్లాలోని వివిధ మండలాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు EE మునిచంద్ర పేర్కొన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాలలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News September 12, 2025
చిత్తూరు: 24 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని అరెస్టు చేసినట్లు గురువారం టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వారి వద్ద నుంచి 6 పేకాట కార్డు ప్యాకెట్లను, రూ.37,160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, గంజాయి, స్మగ్లింగ్, ఎర్రచందనం, మద్యం విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
News September 11, 2025
ద్రావిడ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 14 శాఖలో 62 అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు.
News September 11, 2025
కాసేపట్లో జైలులో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.