News March 4, 2025
చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యంశాలు

☞ తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో చిత్తూరుకు ఐదో స్థానం
☞ చిత్తూరు జిల్లాలోని హోటళ్లలో తనిఖీలు
☞ చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి
☞ పుంగనూరులో 12 మంది బైండోవర్
☞ చిత్తూరు: జైలులో వైసీపీ నాయకులకు రోజా పరామర్శ
☞ మల్లప్ప కొండ వద్ద రేపు మినీ కల్చరల్ ఈవెంట్
☞ పలమనేరు: తల్లిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన కుమారుడు
Similar News
News March 3, 2026
చిత్తూరు: నిరుపయోగంగా నీటి తొట్టెలు

వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలను ఉపాధి హామీ పథకంలో నిర్మించారు. జిల్లాలో రూ. 2.71 కోట్ల వ్యయంతో 776 నీటి తొట్టెలను నిర్మించారు. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అధికారులు వీటిలో నీటిని నింపేలా చర్యలు చేపడితే.. వేసవిలో పశువులకు నీటి కొరత ఉండదని పాడి రైతులు తెలుపుతున్నారు.
News March 3, 2026
TPT: 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TTD ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) హాస్పిటల్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TTD ప్రకటనలో పేర్కొంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ మొదలైన 9 విభాగాలలో మొత్తం 30 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 13.
News March 3, 2026
చిత్తూరు: ప్రియురాలిపై అనుమానంతో సూసైడ్

ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్వేటినగరంలో జరిగింది. పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (35) ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆ మహిళపై అనుమానంతో కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


