News March 12, 2026

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది కష్టమే.!

image

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుందని AACPC ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టి.ప్రతిమ తెలిపారు. వేడి గాలులతో పాటు తేమ శాతం తగ్గడంతో ఉక్కపోతతోపాటు, గతేడాది కన్నా 1.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు తేమ శాతం అందించే పంటలతో పాటు వేడిని తట్టుకోగల పంటలు వేసుకోవాలని Way2News ద్వారా ఆమె సూచించారు. మీ ప్రాంతంలో ఎండలు పెరిగాయా?

Similar News

News April 19, 2026

చిత్తూరు: కాలేజీలో కూలిన మెస్ భవనం!

image

చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.