News October 10, 2025
చిత్తూరు జిల్లాలో ఈ దగ్గు మందు వాడుతున్నారా?

‘RespiFresh-TR’ దగ్గు సిరప్‌లో నిషేధిత DEG సాల్వెంట్ 35%పైగా ఉండటంతో దాన్ని ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు DD నాగ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆ సిరప్‌ను టెస్ట్ చేసినప్పుడు నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ‘RespiFresh-TR’ సిరప్ మార్కెట్లో ఉందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66, కడప జిల్లాలోని షాపుల్లో 24 బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.
Similar News
News October 10, 2025
కాఫ్ సిరప్ డెత్స్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

దగ్గు మందు తాగి 20మందికి పైగా చిన్నారులు చనిపోయిన ఘటనపై దాఖలైన పిల్‌ను SC కొట్టేసింది. CBI దర్యాప్తు చేయాలని, డ్రగ్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయా రాష్ట్రాలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. CBIతో దర్యాప్తు అవసరం లేదన్నారు. దీంతో CJIతో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.
News October 10, 2025
HYD: సైబర్ మోసం.. రూ.7.7కోట్లు మాయం

మ్యాట్రిమోనీ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని HYD నగరంలోని సైబర్ సెక్యూరిటీ టీం హెచ్చరించింది. మ్యారేజ్ కం ఇన్వెస్ట్మెంట్ మోసాలతో ఓ వ్యక్తి ఏకంగా రూ.7.7కోట్లు పోగొట్టుకున్నట్లుగా వివరించింది. నూతన లింకులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ప్రతి మెసేజ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ మోసం గుర్తిస్తే 1930 కు కాల్ చేయాలని సూచించింది.