News April 7, 2025

చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు.. 9 లాస్ట్ డేట్: శ్రీదేవి

image

సీడాప్ ఆధ్వర్యంలో DDUGKY పథకం ద్వారా చిత్తూరు, తిరుపతిలో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఎ పీడీ శ్రీదేవి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18-28 ఏళ్లలోపు యువతీ యువకులు ఈనెల 9వ తేదీలోపు అడ్మిషన్లు చేసుకోవాలన్నారు. ఈ రెసిడెన్షియల్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9963561755 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News April 8, 2025

చిత్తూరులో భార్యపై యాసిడ్‌తో దాడి

image

చిత్తూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన దావూద్, రేష్మ భార్యభర్తలు. మనస్పర్థలతో ఇటీవలే విడిపోయారు. ఈక్రమంలో నిన్న రాత్రి దావూద్ రేష్మ ఇంటికి వెళ్లి కాపురానికి రావాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో దావూద్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రేష్మ ముఖంపై చల్లాడు. ఆమె గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. గాయపడిన రేష్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 8, 2025

చిత్తూరు DCHSగా పద్మాంజలి 

image

చిత్తూరు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి(DCHS)గా డాక్టర్ పద్మాజలి దేవి బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజి‌స్ట్‌గా పని చేస్తూ జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారిగా ప్రమోషన్ పొందారు. ఇన్‌ఛార్జ్‌ డీసీహెచ్‌ఎస్ ప్రభావతి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా పనిచేస్తానని చెప్పారు.

News April 8, 2025

గణనాథుని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి

image

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. సోమవారం ఆయన స్వామి వారి దర్శనానికి రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. మారుతి ప్రభాస్ హీరోగా  ‘రాజాసాబ్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.   

error: Content is protected !!