News December 29, 2025
చిత్తూరు జిల్లాలో కనపడని మామిడి పూత..!

చిత్తూరు జిల్లాలో మంచు ప్రభావంతో మామిడి తోటల్లో ఇంతవరకు పూత కనబడటం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.65 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నాటికి తోటల్లో మామిడి పూత వస్తుంది. ఈసారి మంచు అధికంగా ఉండటంతో ఇప్పటివరకు పూత కనిపించ లేదు. రైతులు వేలాది రూపాయలు వ్యయం చేసి మందులు పిచికారీ చేస్తున్నారు.
Similar News
News January 2, 2026
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
News January 2, 2026
చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి
News January 2, 2026
చిత్తూరు: తగ్గిన రిజిస్ట్రేషన్లు

జనవరి 1న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. చిత్తూరు అర్బన్‌లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగకపోగా, చిత్తూరు రూరల్ పరిధిలో 4 మాత్రమే అయ్యాయి. సాధారణ రోజుల్లో రెండు కార్యాలయాల్లో కలిపి 30-50 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. పండగ నెల కావడంతో క్రయ, విక్రయదారులు లేకపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. జనవరి 1న సెలవుగా భావించి పలువురు రాలేదని అధికారులు చెప్పారు.


