News January 11, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి కిలో రూ.185 నుంచి రూ.190, మాంసం రూ.268 నుంచి 290 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.305 నుంచి రూ.315 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News February 13, 2026
కుప్పంపై అధికారుల ప్రత్యేక దృష్టి

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 20 గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడి అవకాశం ఉందని RWS అధికారులు అంచనా వేస్తున్నారు. 20 గ్రామాల్లో 10 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు, మరో 7 గ్రామాల్లో తాగునీరు, పశువులకు నీటి సరఫరా చేసేలా, మిగిలిన 5 గ్రామాలలో ప్రైవేట్ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు రూ.23.02 లక్షలు ఖర్చు చేయనున్నారు.
News February 13, 2026
చిత్తూరు: నీటి ఎద్దడి సమరం..అధికార యంత్రాంగం సన్నద్ధమా?

వేసవి ప్రారంభం కాకముందు ఎండలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ నీటి మట్టం 8.04 మీటర్లు ఉండగా, గతేడాది 8.94 మీటర్లు ఉండేది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, పలమనేరు, బైరెడ్డి మండలాల్లోని అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొనే ప్రాంతాలపై RWS అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
News February 13, 2026
చిత్తూరు: 2.25 లక్షల రుద్రాక్షలతో మహా శివలింగం ఎక్కడో తెలుసా..

గుడిపల్లి (M) మల్లప్ప కొండపై నెలకొని ఉండు శ్రీ మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా మల్లప్ప కొండపై 2.25 లక్షల రుద్రాక్షలతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


