News October 5, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.141నుంచి రూ.153, మాంసం రూ.204 నుంచి 230 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.233 నుంచి రూ.255 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News October 5, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వెదురుకుప్పం మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక వివరాల మేరకు.. పచ్చికాపల్లం-తిరుపతి హైవేపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2025
చిత్తూరు కలెక్టరేట్లో రేపు PGRS

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News October 5, 2025
ప్రమాదంలో కృష్ణాపురం రిజర్వాయర్..?

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ప్రధాన గేట్లు మూడు చోట్ల లీకేజీలు ఉండడంతో నీరు వృథాగా పోతోంది. ప్రధాన గేటుకు అవసరమైన జనరేటర్ కూడా పాడైంది. ఐదేళ్లుగా గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఐదేళ్ల క్రితం నిర్మించిన రాక్ కాంక్రీట్ దెబ్బతింది. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు.