News August 11, 2024
చిత్తూరు జిల్లాలో నాటు బాంబుల కలకలం

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. చిత్తపార అటవీ ప్రాంతంలో 19 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. అయితే వీటిని వన్యప్రాణుల వేటకోసం తయారుచేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Similar News
News February 16, 2026
చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
News February 16, 2026
చిత్తూరు: కళ్లు లేవు సార్.. పెన్షన్ ఇప్పించండి!

జీడీనెల్లూరు గ్రామానికి చెందిన మాళవిక తన తండ్రితో కలిసి చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్ డేకు హాజరైంది. తనకు రెండు కళ్లు లేవని.. పెన్షన్ ఇప్పించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. గ్రామ సచివాలయ అధికారులను ఆశ్రయిస్తే.. రాదన్నారని చెప్పింది. అర్హతను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయడానికి నివేదిక ఇవ్వాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
News February 16, 2026
కార్మికులకు పింఛను సౌకర్యం

రోజువారి కూలీలతో జీవనం సాగించే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. వయసును బట్టి నెలకు ప్రీమియం రూ. 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల అనంతరం నెలవారి రూ. 3 వేలు పింఛను వస్తుంది. లబ్ధిదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50% పింఛన్ చెల్లిస్తారు.


