News July 31, 2024

చిత్తూరు జిల్లాలో పలువురు DSPలు బదిలీ

image

చిత్తూరు జిల్లాలోని పలువురు DSPలు బదిలీ అయ్యారు. రాజారావు(TPT)ను విజయవాడ ACPగా, జి శ్రీనివాసరావు(TPT)ను నెల్లూరు రూరల్ SDPOగా, ఉమమహేశ్వరరెడ్డి(SKHT), శరత్ రాజ్ కుమార్ (చంద్రగిరి), ప్రసాద్ రెడ్డి(MPL), షను షెక్‌(TPT)ను పోలీసు Hqtrకు, రవిమనోహారాచారి(TPT)ని CID DSPగా, శ్రావణ్ కుమార్(CTR)ను ఏలూరుటౌన్‌కు, B.మురళి(TPT)ను పులివెందులకు, శ్రీనివాసాచారి(తిరుమల) కర్నూల్ దిశ DSPగా బదిలీ అయ్యారు.

Similar News

News February 8, 2026

చిత్తూరు: వృద్ధురాలి దారుణ హత్య

image

గుడిపల్లి (M) ON కొత్తూరు సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఆదివారం చిన్నక్క (70) ఆనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుతో పాటు చెవులను సైతం కోసి దారుణంగా హత్య చేశారు. ఇటుకల బట్టీలో వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని ఇటుకల కోసం వచ్చిన వారు చూసి స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 8, 2026

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు PGRS కార్యక్రమం

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉ.10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లాస్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

News February 8, 2026

ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలోని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై (బర్డ్ ఫ్లూ) పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీ పక్షుల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖకు, జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుందన్నారు.