News February 18, 2025
చిత్తూరు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల గరిష్ఠంగా నమోదవుతాయన్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 3, 2026
చిత్తూరు: బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని MJP గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సదుం, సత్యవేడు, తంబళ్లపల్లి, ఐతేపల్లి, కుప్పంలలో బాలురకు, కలికిరి, పీలేరు, ఉదయమాణిక్యం, పెద్దపంజాణి, పులిచెర్ల, కుప్పంలలో బాలికలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. http://mjpa pbcwreir.apcfrr.in లో దరఖాస్తు చేయాలన్నారు.
News February 3, 2026
మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

గత సీజన్‌లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
News February 2, 2026
చిత్తూరు జిల్లాలో విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి

వెదురుకుప్పం (M) పాతగుంట గ్రామానికి చెందిన జి మధు (3) సోమవారం వేడి నీటిలో పడి శరీరం పూర్తిగా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల అత్యవసర చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


