News December 23, 2025
చిత్తూరు జిల్లాలో మందగిస్తున్న ఉపాధి పనులు.!

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News December 24, 2025
చిత్తూరు జిల్లాలో ఇతగాడితో జాగ్రత్త..!

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన కె.చంద్రబాబు(33)పై ప్రభుత్వం PD యాక్ట్ ప్రయోగించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమాయకులను మోసం చేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండేళ్లలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రజాశాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు అడ్వయిజరీ బోర్డు తేల్చింది. 12నెలలు అతడిపై పీడీ యాక్ట్ అమలు కానుంది.
News December 24, 2025
జనవరి నుంచి చిత్తూరు మరింత చిన్నదాయే.!

జనవరి ఫస్ట్ వీక్‌లో మదనపల్లె జిల్లాను ప్రారంభించే అవకాశం ఉంది. CTR, అన్నమయ్య జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదట. దీంతో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెతోపాటూ పుంగనూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలతో కొత్త జిల్లా ఏర్పడనుంది. చిత్తూరు జిల్లా 32 మండలాల నుంచి 28కి పరిమితం కానుంది.
News December 23, 2025
పుంగనూరు: అనపకాయలకు భలే డిమాండ్

చిత్తూరు జిల్లాలో ఈ సీజన్‌లో అనపకాయలు విరివిగా లభిస్తాయి. పలువురు రైతులు వీటిని ప్రధాన పంటగా, అంతర్ పంటగా భూముల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులు కిలో రూ.50 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి ఇవి ఎగుమతి అవుతున్నాయి. అనప గింజలు, పితికి పప్పు కూరను పలువురు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని నూనెలో వేయించి స్నాక్స్‌గా కూడా వాడుతారు.


