News June 26, 2024

చిత్తూరు జిల్లాలో మళ్లీ సగం మంది ఫెయిల్

image

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటలేకపోయారు. తిరుపతి జిల్లాలో 8256 మంది పరీక్షలు రాయగా 3,719 మందే(45శాతం) పాసయ్యారు. రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచారు. చిత్తూరు జిల్లాలో 5,817 మందికి 2,597 మంది ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 5,371 మందికి 2,597 మంది పాసై 46 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచారు.

Similar News

News January 29, 2026

చిత్తూరులో కేంద్రీయ విద్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభం

image

చిత్తూరు జిల్లా మంగసముద్రంలో కొత్త కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026–27 విద్యా సం. నుంచి ఈ విద్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఎదురుగా తాత్కాలిక భవనాల్లో I నుంచి Vవ తరగతి వరకు బోధన ప్రారంభమవుతుంది. భూమి బదిలీ పూర్తికావడంతో అడ్మిషన్లను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.

News January 28, 2026

అందుబాటులోకి ఆయుష్మాన్ భారత్ కార్డులు

image

చిత్తూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది వివరాలను కార్డులో అధికారులు నమోదు చేయించారు. రోగి పూర్తి వివరాలు కార్డు స్కాన్ చేయడం ద్వారా వైద్యులకు తెలిసిపోతుంది. తద్వారా వైద్య సేవలు అందించడం సులభతరం కానుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా జిల్లా, ఏరియా, సిహెచ్సీలోనూ వీటి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.

News January 28, 2026

చిత్తూరుకు మరో 450 టన్నుల యూరియా

image

కడప జిల్లా నుంచి మరో 450 టన్నుల యూరియా చిత్తూరు జిల్లాకు బుధవారం రానుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,301 టన్నుల యూరియా నిల్వలున్నాయన్నారు. వీటిని 230 రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తున్నామని వెల్లడించారు.