News February 19, 2025

చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై <<>>క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

Similar News

News February 20, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాల్టి ముఖ్య ఘటనలు

image

✒ చిత్తూరు జిల్లాలో పబ్లిక్ పరీక్షలపై కలెక్టర్ కీలక ఆదేశాలు
✒ 22న కుప్పానికి హైపర్ ఆది రాక
✒ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం: కుప్పం DSP
✒ కార్వేటినగరంలో ముగ్గురి అరెస్ట్
✒ తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
✒ చిత్తూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
✒ తిరుపతి-పీలేరు హైవేపై రెండు కార్లు ఢీ
✒ జీడీ నెల్లూరు MRO ఆఫీసులో తనిఖీలు

News February 20, 2025

తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ మండలం, రామంజపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఆర్‌సీ పురం జంక్షన్ నుంచి ఉప్పరపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

చిత్తూరు: పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో 30,652 మంది విద్యార్థులు, పదో తరగతిలో 21,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణలో చీటింగ్‌కి పాల్పడితే ఎగ్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!